20న భైంసా, కామారెడ్డిలో రాహుల్ గాంధీ సభ

భైంసా : నిర్మల్ జిల్లా భైంసా… కామారెడ్డి పట్టణాల్లో ఈనెల(అక్టోబర్) 20వ తేదీన రాహుల్ గాంధీ నిర్వహించబోయే సభా స్థలాలను పరిశీలించారు ఏఐసీసీ, పీసీసీ నేతలు. పొద్దున బేగంపేట్ నుంచి ఏఐసీసీ ప్రతినిధులతో హెలికాప్టర్ లో భైంసాకు వచ్చారు. AICC ప్రధాన కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, రాజీవ్ బోస్, రామచంద్ర కుంతియా,  ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, సబిత ఇంద్రారెడ్డి. ముందు భైంసా.. ఆ తర్వాత కామారెడ్డిలో నిర్వహించే సభ స్థలాలను పరిశీలించారు.

20న బైంసాలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.  ముధోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిని నోట్లకట్టలతో కొనుగోలు చేశారని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కేసీఆర్ మోసం చేశారనీ.. ప్రాణహిత చేవెళ్లను విస్మరించిన టి.ఆర్.ఎస్ ను బొంద పెట్టాలన్నారు. అమరులు ఏ ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించని కేసీఆర్ ను మళ్ళీ గెలిపించొద్దన్నారు. కేసీఆర్ నరేంద్ర మోడీ ఏజెంట్ అని.. మైనారిటీలంతా టి.ఆర్.ఎస్ కి బుద్ధిచెప్పాలని అన్నారు ఉత్తమ్. దళిత, గిరిజనులకు సన్నబియ్యం సహా 9రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తామన్నారు.

రాహుల్ సభను అంతా కలిసి విజయవంతం చేయాలన్నారు జానారెడ్డి. టికెట్లు ఎవరికి వచ్చినా విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషిచేయాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates