20 ఏళ్ల తర్వాత : రెండు సార్లు టైటిల్ నెగ్గిన ఫ్రాన్స్

ఫిఫా వరల్డ్ కప్ ఎన్నో రికార్డులకు వేదికగా నిలిచింది. దశాబ్దాల కాలం నాటి రికార్డులను కొల్లగొట్టి.. కొత్త చరిత్రను మొదలు పెట్టింది. 2018 విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్…. రెండో సారి సాకర్ కప్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు  రెండు సార్లకుపైగా ప్రపంచకప్ సాధించిన బ్రెజిల్, జర్మనీ, ఇటలీ, ఉరుగ్వే, అర్జెంటీనాల సరసన నిలిచింది ఫ్రాన్స్. 1998, 2006, 2018లో  మొత్తం మూడు సార్లు ఫైనల్ చేరిన ఫ్రెంచ్ జట్టు … 1998లో మొదటిసారి కప్ కొట్టింది. 2006లో ఇటలీ చేతిలో ఓడి రన్నరఫ్ గా సరిపెట్టుకుంది. మళ్లీ 20 ఏళ్ల గ్యాప్ తర్వాత ఫిఫా కప్ ను గెలుచుకుంది ఫ్రాన్స్ టీం.

ఈ విక్టరీతో ఫ్రాన్స్ కోచ్ డైడర్ డెస్ ఛాంప్స్ అరుదైన ఘనత సాధించాడు. 1998లో ఫ్రాన్స్ ఛాంపియన్ గా గెలిచినప్పుడు… డెస్ ఛాంప్స్ కెప్టెన్. నాటి టోర్నీలో జినెదిన్ జిదాన్, థియరీ హెన్రీలాంటి దిగ్గజాలతో కలిసి ఫ్రాన్స్ ను ఛాంపియన్ గా నిలిపాడు డెస్ ఛాంప్స్. ఇపుడు తన సొంత టీంకు కోచ్ గా మరోసారి జగజ్జేతగా నిలిపాడు. ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా రికార్డుల్లో నిలిచాడు డెస్ ఛాంప్స్. అంతకుముందు బ్రెజిల్ లెజెండ్ మారియో జగాలో, జర్మనీ దిగ్గజం బెకెన్ బాయర్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

వరల్డ్ కప్ ఫైనల్ లో 4గోల్స్ కొట్టడం ఇదే రికార్డు. 1970లో బ్రెజిల్ తర్వాత మళ్లీ ఇప్పుడే 4 గోల్స్ కొట్టిన తొలి టీంగా ఫ్రాన్స్ రికార్డు సృష్టించింది. అటూ 2002 నుంచి జరిగిన మొత్తం నాలుగు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచుల్లో మొత్తం 6 గోల్స్ మాత్రమే కొడితే.. ఈ ఒక్క మ్యాచ్ లోనే 6 గోల్స్ వచ్చాయి. 1958 ఫైనల్ తర్వాత ఒకే మ్యాచ్ లో 6 గోల్స్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం.

నెల రోజుల పాటు ఉర్రుతలూగించిన ఫిఫా ప్రపంచ కప్ 2022లో  ఖతార్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. దీనికి సంబంధించి… ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ ఫాంటినో సమక్షంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ .. ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ థనీకి 2022 ప్రపంచ కప్ టార్చ్ ను అందించారు. రష్యాలో సక్సెస్ గా జరిగినట్లుగా.. ఆదేశంలోనూ సక్సెస్ గా జరగాలని పుతిన్ కోరుకున్నారు. ప్రపంచ కప్ టోర్నీకి అథిత్యమిస్తున్న తొలి అరబ్ కంట్రీగా ఖతార్ రికార్డుల్లోకెక్కింది.

ఈ ఫిఫా వరల్డ్ కప్ లో అత్యధికంగా 6 గోల్స్ చేసిన ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీకేన్ కు గోల్డెన్ బూట్ దక్కింది. ఉత్తమ ఆటగాడిగా క్రొయేషియా ప్లేయర్ లూకా మోద్రిచ్ కు గోల్డెన్ బాల్, ఉత్తమ గోల్ కీపర్ గా బెల్జియం ప్లేయర్ కోర్ట్ వాకు గోల్డెన్ గ్లోవ్, న్యాయంగా ఆడిన జట్టుగా స్పెయిన్ కు ఫెయిర్ ప్లే, బెస్ట్ ప్లేయర్ గా ఫ్రాన్స్ ఆటగాడు ఎంబపెకు యంగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates