హాట్ కేక్… 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో Mi A2

ఢిల్లీ : మొబైల్ మార్కెట్ దిగ్గజం షియామీ మిడ్ రేంజ్ లో ఇటీవల రిలీజ్ చేసిన కొత్త మోడల్ ఫోన్ ఆన్ లైన్ లో దున్నేస్తోంది. ఈ కామర్స్ సైట్లలో లేటెస్ట్ మోడల్ ఫోన్లు… సేల్ కు పెట్టిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. షియోమీ లేటెస్ట్ గా లాంచ్ చేసిన Mi A2 ఫోన్ ను కొనేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పుడున్న యూత్ .. కెమెరా టెక్నాలజీ… సెల్ఫీ టెక్నాలజీ  మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో కెమెరాల టెక్నాలజీ ఏది అప్ డేట్ వస్తే.. దానికి కొనుక్కునేందుకు ఇంట్రస్ట్  చూపిస్తున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు 12, 20 మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ బ్యాక్ కెమెరా ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చారు. 4 జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్ ఫీచర్లతో రిలీజైన ఈ ఫోన్ ధర రూ.16,999/-

ఎంఐ ఎ2 ఫోన్ స్పెసిఫికేషన్స్…

  • 5.99 ఇంచెస్ స్క్రీన్
  • LTPS IPS LCD డిస్ ప్లే టెక్నాలజీ
  • క్వాల్ కామ్ SDM 660, స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
  • స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్
  • రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • f/1.75 అపార్చర్
  • 3010 mah బ్యాటరీ
  • Android v8.1 Oreo ఆపరేటింగ్ సిస్టమ్
  • డ్యుయల్ SIM (nano+nano) డ్యూయల్ స్టాండ్ బై (4G+4G)

 

 

Posted in Uncategorized

Latest Updates