అమెరికాలో కాల్పుల కలకలం.. 20 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పోసోలో ఉన్న వాల్ మార్ట్ స్టోర్ లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో మార్ట్ లోకి వెళ్లిన దుండగులు.. పెద్ద ఎత్తన విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది వరకు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు అక్కడున్న ప్రజలు పరుగులు పెట్టారు. ఎంత మంది చనిపోయారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్యాట్రిక్ ఫాక్స్ తెలిపారు. దుండగులు కాల్పులకు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.కాల్పులకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు భద్రతాబలగాలు వెల్లడించాయి. టెక్సాస్ కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. టెక్సాస్ ప్రజలకు అండగా ఉంటామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాల్పుల చర్యను పిరికి చర్యగా ట్రంప్ అభివర్ణించారు.

Latest Updates