20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు రెడీ!

సేఫ్టీ చెక్ పూర్తయితే.. ‘రెడీ టు గో’ అన్నట్లుగా సిద్ధం: ట్రంప్ ప్రకటన

వాషింగ్టన్: అమెరికాలో కరోనా డిసీజ్ ను నివారించేందుకు ఆల్రెడీ 20 లక్షల వ్యాక్సిన్ డోసులు రెడీ అయ్యాయని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. జస్ట్ సేఫ్టీ చెక్ ప్రక్రియ పూర్తయితే చాలు.. ఇవన్నీ మార్కెట్లోకి ‘రెడీ టు గో’ అన్నట్లుగా సిద్ధంగా ఉన్నాయన్నారు. శుక్రవారం వైట్ హౌస్‌ దగ్గర మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘వ్యాక్సిన్లపై నిన్న మీటింగ్ జరిగింది. మనం అద్భుతంగా ముందుకెళ్తున్నాం. చాలా పాజిటివ్, సర్ ప్రైజింగ్ అంశాలు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్లపై మంచి ప్రోగ్రెస్ కనపడుతోంది” అని చెప్పారు. వ్యాక్సిన్ లకు సేఫ్టీ చెక్ పూర్తయితే చాలు.. ట్రాన్స్ పోర్టేషన్, లాజిస్టిక్స్ వంటివి రెడీగా ఉన్నాయన్నారు.

కరోనా ట్రీట్ మెంట్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం ట్రంప్ సర్కారు ఐదు కంపెనీలను సెలక్ట్ చేసుకున్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. అయితే, ప్రధానంగా 4 కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ఉన్నాయని, మొత్తంగా 8 కంపెనీలు ఇలాంటి రీసెర్చ్ లో ఉన్నాయని ట్రంప్ చెప్పారు. వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్​హెల్త్ సంస్థ మోడెర్నా బయోటెక్ కంపెనీతో కలిసి కరోనా వ్యాక్సిన్ తయారీకి ఫాస్ట్ ట్రాక్ వర్క్ కొనసాగిస్తోందని మీడియా చెప్తోంది. నాలుగు కంపెనీలు వ్యాక్సిన్ లు తయారు చేస్తున్నాయని, 2021 ప్రారంభం నాటికి 20 లక్షల డోసులు సిద్ధం కావచ్చని వైట్ హౌస్‌ హెల్త్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఇటీవల వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం

నెట్టింట్లో వైరల్ అవుతున్న సన్న పిన్ చార్జర్

Latest Updates