పాకిస్తాన్ లో రైలు ఢీ కొని బస్సులోని 20 మంది మృతి

పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది.  రైల్వేక్రాసింగ్ దగ్గర బస్సును వేగంతో వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది సిక్కు యాత్రికులు చనిపోయారు. మరి కొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పంజాబ్ ప్రావిన్స్ లోని షీకుపురా జిల్లా ఫరీదాబాద్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. ఒకే ఫ్యామిలీకి చెందిన 25 మంది యాత్రికులు మినీ బస్సులో  వెళుతుండగా  ఫరీదాబాద్ దగ్గర రైల్వే క్రాసింగ్ దాటుతున్న సమయంలో కరాచీ-లాహోర్ షా హుస్సేన్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది.

Latest Updates