20 వేల విమానాలు.. పార్కింగ్​ ఎట్లా?

కరోనా భయంతో తగ్గిన ఎయిర్​ ట్రాఫిక్
భారీగా పెరుగుతున్న ల్యాండింగ్​ ఫీజులు 

న్యూఢిల్లీ: విమానాలు గాలిలో ఉంటేనే సేఫ్​. అవి గనుక నేలమీద ఎక్కువ సేపు ఉంటే చాలా నష్టం. వాటిని నిలిపి ఉంచడానికి సరిపడా పార్కింగ్​ ప్లేస్​కూడా ఉండదట! ప్రపంచవ్యాప్తంగా రోజూ 20 వేల విమానాలు గాలిలో తిరుగుతుంటాయి. అలా ఉంటేనే రాబడి. లాండింగ్​ చేసి ఉంచేస్తే పార్కింగ్​ ఫీజు భరించడం కష్టం. యూరోపియన్​ హబ్​ల్లో ఏ ఎయిర్​పోర్టులోనైనా ఒక విమానాన్ని నిలబెడితే గంటకు 285 డాలర్లు (రూపాయల్లో 20 వేల పైమాటే)! . కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో  మార్చి రెండోవారం నుంచే ఎయిర్​ ట్రాఫిక్​ చాలా తగ్గిపోయింది. కొన్ని ఎయిర్​లైన్స్​ నామ్​కే వాస్తే అన్నట్లుగా విమానాలు నడుపుతున్నాయి.

డెల్టా ఎయిర్​లైన్స్​వాళ్లు తమ ఫ్లీట్​ సర్వీసుల్లో 70 శాతం తగ్గించేసుకుంది. తమ విమానాల్లో 600కి పైగా పార్కింగ్​ చేసింది. పాత విమానాలకు రిటైర్మెంట్​ ఇచ్చేయాలనికూడా అనుకుంటోంది. ఆస్ట్రేలియాకి చెందిన ఖ్వాంటస్​ తాత్కాలికంగా 150 విమానాలు ఆపేసింది. వాటికి పార్కింగ్​ ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని ఎయిర్​పోర్టు అథారిటీలతోనూ, ప్రభుత్వంతోనూ చర్చలు జరుపుతోంది. జర్మనీలో లుఫ్తాన్సా గ్రూప్​ ఏకంగా 90 శాతం సీటింగ్​ కెపాసిటీని తగ్గించుకుంది. మార్చి 29 నుంచి ఏప్రిల్​ 24 వరకు షార్ట్​, మీడియం, లాంగ్​ జర్నీ  విమానాలపై కంట్రోల్​ పెట్టుకుంది. దాదాపుగా 23 వేల  ట్రిప్పులు క్యాన్సిల్​ చేసేసింది.

ఇదేదో జనతా కర్ఫ్యూ వల్లనే ఏర్పడ్డ పరిస్థితి అనుకోకూడదని ఎయిర్​లైన్స్​ వర్గాలు అంటున్నాయి. గడచిన మూడు వారాలుగా ఇంటర్నేషనల్​ ఎయిర్​ ట్రాఫిక్​ సగానికి, డొమెస్టిక్​ సర్వీసులు 15 శాతానికి పడిపోయాయి. సాధారణంగా ఢిల్లీ ఎయిర్​పోర్టు నుంచి నెలకు 61 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు.  కరోనా వైరస్​ వార్తలు వచ్చినప్పటినుంచీ చాలామటుకు తగ్గిపోయింది. సోమవారం(23వ తేదీ)  నుంచి ఇంటర్నేషనల్​ విమానాల రాకపోకలు నిలిపేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో… ఆదివారం ఎక్కువగా బయటి దేశాల ప్యాసింజర్లు వచ్చేశారు. దీంతో ఒక్కసారిగా ఢిల్లీ ఎయిర్​పోర్టులో తాకిడి పెరిగిపోయింది.

Latest Updates