ఢిల్లీ లో అగ్ని ప్రమాదం.. 200 గుడిసెలు కాలిపోయాయి

ఢిల్లీ కరోల్ బాగ్ అర్పిత్ హోటల్ అగ్ని ప్రమాద ఘటన మర్చిపోకముందే మరో ప్రమాదం జరిగింది. పశ్చిమపురి ప్రాంతంలోని స్లమ్ ఏరియాలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలియగానే ఫైర్ సిబ్బంది 25  ఫైరింజన్లతో స్పాట్ కు చేరుకున్నారు. మంటలు ఆర్పడానికి 2 గంటల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో 200 గుడిసెలు కాలిపోయాయి. వాహనాలు, దుస్తులు అన్నీ బూడిదయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంతో కట్టు బట్టలతో జనం రోడ్డున పడ్డారు. తమ వస్తువులన్నీ కాలిపోయాయని బాధితులు వాపోయారు. రాత్రంతా పిల్లలతో పాటు చలిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. తమను ఆదుకోవాలని కోరారు.

Latest Updates