కజకిస్తాన్ లాక్ డౌన్.. ఎయిర్ పోర్ట్ లోనే 200మంది భారత విద్యార్థులు

కరోనా వ్యాప్తితో ఎక్కడివారు అక్కడే లాక్  అవుతున్నారు. విదేశాల్లో ఉన్నవారు అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి.  వైద్యవిద్యకోసం కజకిస్థాన్ వెళ్లిన 200 మంది భారత విద్యార్థులు అక్కడే ఆగిపోయారు. కజకిస్తాన్ ఆల్మట్టి ప్రాంతంలో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ ప్రకటించారు అక్కడి అధికారులు. అక్కడ విద్యాసంస్థలు  బంద్  చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇతర దేశాల నుంచి రాకపోకలు కూడా నిషేధించింది కజకిస్తాన్ ప్రభుత్వం. దీంతో ఎటు వెళ్లాలో తెలియక 200 మంది  విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఎయిర్ పోర్ట్ లోనే ఉన్నారు.  తమను వెంటనే ఇండియాకు తీసుకువచ్చేందుకు చొరవ చూపాలని భారత ప్రభుత్వానికి వీడియో మెసేజ్ పంపుతున్నారు విద్యార్థులు. కజకిస్థాన్ వెళ్లిన 200 మందిలో సుమారు 30 మందికి పైగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ విషయం తెలిసిన వారి తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు.

see more news

కరీంనగర్ సేఫ్..వాళ్లే నన్ను వద్దన్నారు

తెలంగాణలో 24 గంటలు జనతా కర్ఫ్యూ..రేపు అన్నీ బంద్

బ్రేకింగ్.. తెలంగాణలో21 కి చేరిన కరోనా కేసులు

ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు..జనతా కర్ఫ్యూను పాటిద్దాం

 

Latest Updates