200 ఏళ్ల క్రితమే… హ్యాండ్ వాష్ థియరీ

ఏదైనా అకేషన్​ రైజ్​ చేయడంలో గూగుల్​ సెర్చ్​ ఇంజన్​ ముందుంటుంది. అదే ముందుచూపుతో కరోనా వైరస్​ కంట్రోల్​కి ప్రత్యేక డూడుల్​ పెట్టింది. మనిషినిగానీ, వస్తువుల్నిగానీ తాకిన తర్వాత చేతుల్ని శుభ్రపరచుకోవాలనే మెసేజ్​నిచ్చింది. దీనికోసం ‘ఇన్​ఫెక్షన్​ కంట్రోల్​ పితామహుడు డాక్టర్​ ఇగ్నాజ్ సెమెల్వీస్​’తో వీడియో డూడుల్​ చేసింది. రెండు చేతుల్ని ఎంత శ్రద్ధగా కడుక్కోవాలో వీడియో తెలుపుతుంది.

యాంటీ సెప్టిక్ ప్రొసీజర్స్​లో మొదటి వ్యక్తి  

డాక్టర్​ ఇగ్నాజ్​ హంగెరీలోని బుడాలో పుట్టి, వియన్నాలో డాక్టరీ చదువుకుని, మాస్టర్​ డిగ్రీని మిడ్​వైఫరీ (అబ్​స్టెస్ట్రిక్స్​)లో చేశారు. అప్పట్లో కాన్పుల సమయంలో.. తల్లికి బిడ్డకు తరచు ఇన్​ఫెక్షన్స్​ సోకుతుండేవి. వీటిని ‘చైల్డ్​బెడ్​ ఫీవర్​’గా భావించేవారు. ప్రసూతి మరణాలుకూడా ఎక్కువగా నమోదయ్యేవి. ఇగ్నాజ్​ ఈ పరిస్థితిని బాగా గమనించి… డాక్టర్లు, మిడ్​వైఫ్​లు, నర్సులద్వారానే ఇన్​ఫెక్షన్​ వ్యాపిస్తుందని గుర్తించారు. 1847లో వియన్నా జనరల్​ హాస్పిటల్​లో మెటర్నిటీ క్లినిక్​ చీఫ్​గా నియమితులయ్యాక మెడికల్​ టీమ్​ వ్యక్తిగత శుభ్రతపై దృష్టి పెట్టారు.

ఇగ్నాజ్​ని పిచ్చోడన్నారు

అయితే, డాక్టర్​ ఇగ్నాజ్​ సెమెల్వీస్​ చెప్పినదాన్ని మొదట్లో అందరూ వేళాకోళం చేసేవారు. చాదస్తంగా కొట్టిపారేసేవారు.  ఆయనకూడా తన థియరీకి సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపలేకపోవడంతో మెడికల్​ రంగంలో విమర్శలు ఎక్కువయ్యాయి. చైల్డ్ బెడ్ ఫీవర్ అనేది ఒక అంటువ్యాధని, హేండ్​ వాష్​తో దానిని నివారించవచ్చని కలవరించేవాడు. దాంతో ఆయనను మెంటల్ హాస్పిటల్​లో చేర్చి గొలుసులతో కట్టేసి కొట్టేవారు. ఆ సమయంలో భుజానికి అయిన గాయంతో సెప్టిక్​ అయ్యింది. చివరికి 47 ఏళ్లకే చనిపోయాడు.

అయితే, క్రమంగా ఆయన చెప్పిన హేండ్​ వాష్​ పద్ధతితో మంచి రిజల్ట్స్​ రావడాన్ని గుర్తించారు. శానిటైజేషన్​ చాలా ముఖ్యమని తెలుసుకున్నారు. డాక్టర్​ ఇగ్నాజ్​ చెప్పిన శానిటైజేషన్​ని 20 ఏళ్ల తర్వాత ‘జెర్మ్​ థియరీ ఆఫ్​ డిసీజ్​ (రోగకారకమైన వైరస్)’గా అందరూ ఆదరించారు. లూయీ పాశ్చర్ ‘జెర్మ్ థియరీ’, జోసెఫ్ లీస్టర్ ‘హైజీనిక్ మెథడ్స్’, రాబర్ట్ కోచ్ ‘ఇన్ ఫెక్షన్స్ ట్రాన్స్​మిషన్’ థియరీలకు డాక్టర్​ ఇగ్నాజ్​ పరిశోధనే ఆధారం. అప్పటినుంచే ఇగ్నాజ్ థియరీని ఒప్పుకున్నారు. ఇప్పుడు కరోనా వైరస్​ ఆపడానికి ‘జెర్మ్​ థియరీ ఆఫ్​ డిసీజ్​’నే ప్రపంచం పాటిస్తోంది.  ​

ఇగ్నాజ్ ఏం చెప్పారంటే…

డాక్టర్లతోపాటుగా ప్రసూతి వైద్యం చేసే ప్రతి ఒక్కరూ చేతుల్ని క్లోరినేటెడ్​ లైమ్​ సొల్యూషన్​తో కడుక్కోవాలని సూచించారు. జనరల్​ చెకప్​లోనూ, ఆపరేషన్ల సమయంలోనూ, శవ పరీక్షలు చేసేటప్పుడు శానిటైజ్​ చేసుకోమన్నారు. పేషెంట్లను గ్యాప్​ లేకుండా చూడడంవల్ల ఒకరి నుంచి మరొకరికి ఇన్​ఫెక్షన్​ వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే పేషెంట్​కి పేషెంట్​కి నడుమ మెడికల్​ టీమ్​ తమ చేతులకు ఎలాంటి వైరస్​ లేకుండా వేళ్ల సందులు, అరచేతులు పట్టి పట్టి శుభ్రం చేసుకోవాలన్నారు.

Latest Updates