ముస్లింల అభ్యున్నతి కోసం 2వేల కోట్లు

ముస్లింల అభివృద్ధి కొరకు ఏదైనా పార్టీ ఉందంటే అది TRS పార్టీయేనన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన… భారత దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బడ్జెట్లో ముస్లింల అభ్యున్నతి కోసం 2వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందన్నారు. ముస్లిం పిల్లల చదువుల కోసం ఎన్నో రెసిడెన్సీయల్ పాఠశాలలను ప్రారంభించిందని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ముస్లింలకు జరిగిందేమి లేదన్నారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ హయాంలో బాబ్రీ మసీదు కూల్చివేతకు గురై ఎంతో మంది చనిపోయారని ఆరోపించారు మంత్రి మహమూద్ అలీ.

పేద ముస్లిం పిల్లల విదేశీ చదువులకోసం TRS ప్రభుత్వం 20 లక్షల వరకు ఋణ సదుపాయం కల్పిస్తోందన్నారు మహమూద్ అలీ. పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో TRS పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. జహీరాబాద్ లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు.

Latest Updates