అమెరికాలో 2 వేల మంది ఖైదీలకు కరోనా

వాషింగ్టన్ : అమెరికాలోని జైళ్లలో కరోనా విజృంభిస్తోంది. చాలా మంది ఖైదీలు కరోనా బారినపడుతున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న ఖైదీల్లో 2000 మందికి కరోనా సోకింది. అనుమానిత లక్షణాలున్న మొత్తం 2700 మందిని టెస్ట్ చేయగా వారిలో 2000 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ వెల్లడించింది. దీనిపై అమెరికాలో లాయర్లు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని పలు జైళ్లలో దాదాపు 1, 50, 000 మంది ఖైదీలు ఉన్నారు. వీరందరి పరిస్థితి ఏంటన్నది భయంగా మారింది. కరోనా బారినపడ్డ ఖైదీల సమాచారం విషయంలో పోలీసులు నెగ్లెక్ట్ గా వ్యవహారిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కరోనా సోకిన ఖైదీల సమాచారం వారి కుటుంబ సభ్యులకు ఇవ్వటం ఖైదీల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఐతే ఫెడరల్ బ్యూరో మాత్రం బయటి కంటే జైళ్లలోనే కరోనా పరిస్థితులు బాగున్నాయని చెబుతోంది.

Latest Updates