కాంగ్రెస్ హయాంలో చేసినవి సర్జికల్ స్ట్రైక్స్  కాదట!

2016 surgical strike was different from the ones Congress is claiming under UPA
  • వాటికి, 2016 స్ట్రైక్స్​కు చాలా తేడా ఉందట
  • ఆర్మీ మాజీ సైనికాధికారుల వెల్లడి
  • కాం గ్రెస్ చేసినవి సీమాం తర దాడులే
  • బెటాలియన్​, డివిజనల్ స్థా యుల్లో నే జరుగుతాయి
  • 2016లో ఎన్డీయే చేసినవే నిజమైన ‘సర్జికల్ ’ స్ట్రైక్స్
  • ​ప్రభుత్వం మొత్తం ఇన్వాల్వ్​ అవ్వడమే కారణం

తమ హయాం లో ఆరు సర్జికల్​ స్ట్రైక్స్ జరిగాయని కాంగ్రెస్‌  చెబుతోంది. వాటిని ఏనాడూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోలేదంటోంది. కానీ, కాం గ్రెస్​ చేసినవి అసలు సర్జికల్​ స్ట్రైక్స్ కానే కాదని ఆర్మీ ఉన్నతాధికారులు కొందరు కొట్టి పారేస్తున్నారు. 2016లో ఎన్డీయే హయాంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కు , కాంగ్రెస్​ చేసిన వాటికి చాలా తేడా ఉందంటున్నారు. 2016 స్ట్రైక్స్ లోని తీవ్రత,  ప్రాధాన్యమే ఆ స్ట్రైక్స్ ను‘సర్జికల్​’గా  మార్చాయంటున్నారు.

ఏంటా తేడా? ఆర్మీ చెబుతున్నదేంటి?

‘‘సీమాంతర ఆపరేషన్లు (క్రాస్​ ఎల్​వోసీ) చాలా చాలా కామన్​. వాటిని ఎప్పుడూ ఎక్కడా రిపోర్ట్​  చేయరు. బెటాలియన్​, దళాలు, డివిజనల్​ స్థా యుల్లో నే ఆపరేషన్లు జరిగిపోతాయి. కాంగ్రెస్​ చేసినవి అలాం టి దాడులే. 2016 సర్జికల్​ స్ట్రైక్స్ వేరు. ఉరీదాడి తర్వాత భారత సైన్యం పాక్​ భూభాగంలోకి వెళ్లి మరీ దాడులు చేసి వచ్చింది. ఈ దాడుల్లో ప్రభుత్వం బాగా ఇన్వాల్వ్​ అయింది. ప్రభుత్వం ,ప్రధాని, ప్రధాని కార్యాలయంలోని ఉన్నత స్థాయి అధికారులు, నాటి ఆర్మీ చీఫ్​ జనరల్​ దల్బీర్​ సింగ్ సుహాగ్ నేతృత్వంలో విస్తృతంగా చర్చలు జరిగాయి’’ అని ఆర్మీ మాజీలు అంటున్నారు.‘‘గతం లోనూ సీమాంతర దాడులు జరిగినా వాటిని 2016 సర్జికల్​ స్ట్రైక్స్‌‌తో  పోల్చలేం . మొత్తం ప్రభుత్వం ఆ దాడుల్లో భాగమైంది. వాటికి, దానికి అదే పెద్ద తేడా” అని రిటైర్డ్​ లెఫ్టినెంట్​ జనరల్​ డీఎస్​ హూడా చెప్పా రు. 2016 సర్జికల్ ​ స్ట్రైక్స్ సందర్భంగా ఆపరేషనల్​ ప్రణాళికలను ఆయనే వేశారు. అంతేకాదు, కాం గ్రెస్​ హయాంలో సెక్యూరి టీ డాక్ట్రిన్​ను తయారు చేసే కీలక పనినీ ఆయనకే అప్పగించారు. శ్రీనగర్​లోని 15 కార్ప్స్(ఉరీ క్యాం పు బాధ్యతలను చూస్తున్నది అదే)మాజీ చీఫ్​ రిటైర్డ్​ లెఫ్టినెంట్​ జనరల్ సతీశ్​ దువా కూడా అదే మాట చెప్పా రు. దాడులు చేసేటప్పుడు లక్ష్యాలు ఎక్కు వగా ఉంటాయని, వేరే సర్వీసులను కూడా అలర్ట్​ చేస్తారని అన్నారు.

‘‘సర్జికల్​ స్ట్రైక్స్ తర్వాత పాకిస్థాన్​ ప్రతీకార దాడులు చేస్తే..ఎలా? ఈ ప్రశ్నమీదే మొత్తం పడమటి కమాండ్​ను హై అలర్ట్​లో పెట్టాం . అంతేకాదు, పాకిస్థాన్​ను ఎదుర్కోవడానికి అటు ఆర్థికంగా, ఇటు దౌత్యపరంగా అన్ని చర్యలూ తీసుకున్నాం ” అని చెప్పా రు. సర్జికల్​ స్ట్రైక్స్  క్రెడిట్​ అంతా ప్రభుత్వానికే దక్కుతుందని క్రాస్​ ఎల్​వోసీ దాడులకు ట్రైనింగ్ , ప్లానింగ్ చీఫ్​గా పనిచేసిన రిటైర్డ్​ మేజర్​ జనరల్​ నరేశ్ బధాని చెప్పారు. 2016 సర్జికల్​ స్ట్రైక్స్ జరగడానికి మూడు నెలల ముందే ఆయన ఉత్తర కమాండ్​ నుంచి రిటైర్​ అయ్యా రు. ‘‘సర్జికల్​ స్ట్రైక్స్  క్రెడిట్​ మొత్తం ప్రభుత్వానికే దక్కుతుంది. భారత సైన్యానికి దాడులు చేసే సత్తా ఉంది. మరి,చేయించే సత్తా కూడా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అది రాజకీయంగానే సాధ్యమవుతుం ది. కాబట్టి సర్జికల్​ స్ట్రైక్స్ పై క్రెడిట్​ తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. అలాగే ఏదైనా నెగెటివ్​గా జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి  ఉంటుంది”అని నరేశ్​ బంధాని అన్నారు.

 

 

 

 

 

 

Latest Updates