2018 న్యూ మోడల్ : ఒప్పో A71 స్మార్ట్‌ఫోన్ విడుదల

OPPO-A71-2018-Latestచైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు ఒప్పో తన న్యూ స్మార్ట్‌ఫోన్ ఎ71 (2018)ను విడుదల చేసింది. రూ.9,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది. ఇందులో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్ ఇచ్చారు. ఈ న్యూ మోడల్ తో ఒకేసారి రెండు సిమ్‌లు, ఒక మెమొరీ కార్డును ఈ ఫోన్‌లో వేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను పూర్తిగా యూనిబాడీ మెటల్ డిజైన్‌లో తయారు చేశారు. ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లేదు.

ఒప్పో A71 ఫీచర్స్

5.2 ఇంచ్ HD IPS డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్, 256GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4G VOLTE, బ్లూటూత్ 4.2, 3000 MAH బ్యాటరీ.

 

 

Posted in Uncategorized

Latest Updates