2019నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: ఏపీ సీఎం బాబు

chandra-babuపోలవరం ప్రాజెక్టు పనులను 2019నాటికి పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం డయా ఫ్రంవాల్ ను సందర్శించిన చంద్రబాబు… 13 జిల్లాల రైతులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ టై బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని అనుకున్న సమయానికి పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం. హంద్రీనీవా పూర్తి చేసి చిత్తూరుకు 2018నాటి సాగునీరు ఇస్తామన్నారు. పోలవరం కేనాల్ పనులన్నీంటినీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మహాసంకల్పం బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు కేంద్రతీరును మరోసారి ప్రశ్నించారు. తర్వాత ప్రాజెక్టులో ముఖ్యమైన డయాఫ్రం వాల్‌ పనుల్ని పూర్తైన సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించి.. ఆ వాల్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఇంజినీర్లను సీఎం ఘనంగా సన్మానించారు.

Posted in Uncategorized

Latest Updates