2019లో టీడీపీ ప్రధాన ప్రత్యర్ధి బీజేపీనే..వైసీపీ ICUలో ఉంది : లోకేష్

lokeshమహానాడు వేదికగా ప్రతిపక్షాలపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి నారా లోకేష్. ప్రతిపక్షాలకు దమ్ము, ధైర్యం ఉంటే తనపై చేస్తున్న ఆరోపణలను సాక్ష్యాలతో సహా నిరూపించాలన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్ధి అన్నారు. బీజేపీ పార్టీ సొంతంగా ఏమీ చెయ్యలేక కులసంఘూలను, నటులను రంగంలోకి దించుతుందన్నారు. ప్రతిపక్ష వైసీపీ ప్రస్తుతం ఐసీయూలో ఉందని, బీజేపీ దానికి ఆక్సిజన్ అందిస్తుందని లోకేష్ అన్నారు. వైసీపీకి పొరపాటున ప్రజలు ఓటు వేస్తే అది బీజేపీకే వెళ్తుందన్నారు. ఉద్దానంలో వాటర్ ప్లాంట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, సీఎం సొంత నియోజకవర్గానికి కేటాయించిన వాటర్ ప్లాంట్ ను ఉద్దానానికి ఇచ్చిన విషయాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గుర్తించాలన్నారు. టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్లపై నే ప్రతిపక్షాలు తిరుగుతున్నాయన్నారు. 68 ఏళ్ల వయస్సులో కూడా రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు కష్టపడుతున్నారని, 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబుని భారీ మెజార్టీతో మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్నారు. తిరుమల వెంకన్నను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నరని, ఆయన జోలికొస్తే ఎలా మాడి మసైపోతారో అందరికీ తెలుసన్నారు లోకేష్.

Posted in Uncategorized

Latest Updates