2019 ఎన్నికలు చాలా ఆసక్తికరం : మమత

mamta-pawar-1-new_152019లో వచ్చే ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉంటాయన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మంగళవారం (మార్చి-27) ఆమె ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మమత.. రాజకీయవేత్తలు కలిస్తే సాధారణంగా రాజకీయాల గురించే మాట్లాడుకుంటారని, అందులో దాచిపెట్టాల్సింది ఏమీలేదని తెలిపారు. వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా ఉంటాయని ఆమె అన్నారు.

ఢిల్లీలో TRS, TDP నేతలతో పాటు.. ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మీసా భారతిలను మమతా బెనర్జీ కలుసుకున్నారు. BJPకి ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్‌ను తీసుకురావాలన్న ఉద్దేశంతో ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం మమతా బెనర్జీ.  ఈ క్రమంలో రాత్రి డిన్నర్ మీటింగ్ ఏర్పాటుచేశారు శరథ్ పవార్. ఢిల్లీలో అందుబాటులో ఉన్న నేతలతో భేటీ అవుతున్నారు మమత. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే ఫెడరల్ ఫ్రంట్ తప్పనిసరి అంటున్నారు. బీజేపీని ఓడించడమూ తమ ఫస్ట్ అడుగు అని మమత ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే బీజేపీ యేతర 19 పార్టీలతో ఇప్పటికే సోనియా డిన్నర్ మీటింగ్ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ క్రమంలో మమత మరింత పట్టుతో రాజకీయ నేతలతో మీటింగులను ఏర్పాటుచేస్తోంది.

అయితే సోనియాతో కలుస్తారా అన్న అంశాన్ని ఆమె తోసిపుచ్చారు. సోనియా హాస్పటల్‌లో ఉన్నారని, ఆమెను రెస్ట్ తీసుకోనిద్దామన్నారు. తాను ఏడు సార్లు ఎంపీగా చేశానని, తనకు అనేక మంది నేతలు తెలుసని ఆమె అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే మమతను కలిసిన విషయం తెలిసిందే.

 

Posted in Uncategorized

Latest Updates