2019 ఎన్నికల్లో…పోటీకి దూరంగా శరద్ పవార్

2019 లోక్‌ సభ ఎన్నికల్లో ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి శరద్‌పవార్‌ పోటీ చేయడం లేదని ఆ పార్టీ నేత జితేంద్ర అహ్వద్‌ తెలిపారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏయే అభ్యర్థులను బరిలోకి దించాలనే దానిపై రాష్ట్ర పార్టీ యూనిట్ ఆఫీస్ లో రెండు రోజుల శమావేశాన్ని శరద్ పవార్ నిర్వహిస్తున్నారు.
రెండు రోజుల సమావేశంలో భాగంగా శనివారం(అక్టోబర్-6) సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు ఎన్సీపీ లీడర్ జితేంద్ర అహ్వద్‌. కొన్ని రోజులుగా పూణే లోక్ సభ నుంచి శరద్ పవార్ పోటీ చేయనున్నారని వదంతులపై ఆయన క్లారిటీ ఇచ్చారు. శరద్ పవార్ రాబోయో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ లో తన పేరు పెట్టొద్దని పవార్‌ చెప్పారన్నారు.
రాఫెల్ డీల్ విషయంలో ఇటీవల ప్రధాని మోడీకి శరద్ పవార్ మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్‌ లీడర్ తారిఖ్‌ అన్వార్‌, పార్టీ జనరల్‌ సెక్రటరీ మునాఫ్ హకిమ్‌ ఎన్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీని తర్వాత…తాను మోడీకి మద్దతు ఇవ్వలేదని, ఎప్పుడూ ఇవ్వనని పవార్‌ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates