2019 ఐపీఎల్.. వేలానికి 1000 మంది క్రికెటర్లు

2019 ఐపీఎల్ వేలానికి టైమ్ ఫిక్స్ అయింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో డిసెంబర్ 18న ఆటగాళ్ల వేలం జరగనుంది. వేలానికి 1000 ఆటగాళ్లు పాల్గొనేందుకు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని బీసీసీఐ బుధవారం తెలిపింది. అందులో 232 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారని చెప్పారు. ఆయా ఫ్రాంఛైజీలు ఇంకా 70 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంది. 200 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు.. 800మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌తో పాటు ముగ్గురు అనుబంధదేశాలకు చెందిన ప్లేయర్స్ పాల్గొంటున్నారు. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలువగా.. ఈ సారి కూడా ఫెవరెట్ టీం గా బరిలోకి దిగనుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates