2019 జూన్‌ తర్వాత తెలంగాణకు పుష్కలంగా నీరు: కేసీఆర్‌

kcrరాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా 2019 జూన్‌ తర్వాత తెలంగాణకు పుష్కలంగా నీరు వస్తుందన్నిరు సీఎం కేసీఆర్. మంగళవారం(మే-29) హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో సీఎం మీడియాతో మాట్లాడారు. రైతు సమన్వయ సమితి కార్యకర్తలు ఇజ్రాయిల్‌ వ్యవసాయ పద్ధతులను పరిశీలించాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెట్టుబడి సాయం రెండో విడతను నవంబర్‌ నెలలో అందిస్తామన్నారు. మొదటి విడతలో పెట్టుబడి సాయం పంపిణీని విజయవంతం చేస్తున్న అధికారులు, మంత్రులను అభినందించారు.

అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారని… అయితే అది అమలు కాని హామీ అన్నారు. కేవలం ఓట్ల కోసం కాంగ్రెస్‌ నేతలు ఆపద మొక్కులు మొక్కుతున్నారన్నారు సీఎం కేసీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates