2019 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

దుబాయ్: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ కు రంగం సిద్ధమైంది. 2019 వరల్డ్‌ కప్ షెడ్యూల్‌ ను ఇవాళ(అక్టోబర్-15) విడుదల చేసింది ICC. మే 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌ కప్ జరగనుంది. జూన్ 5న సౌతాఫ్రికా టీమ్‌తో టీమిండియా తలపడనుంది. జూన్ 16న ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూసే పాకిస్థాన్- భారత మ్యాచ్ ఉంటుంది. మ్యాచ్ లకు సంబంధించిన పూర్తి వివరాలను ఐసీసీ ట్విట్టర్ లో పెట్టింది.

Posted in Uncategorized

Latest Updates