IPL ఆరంభ వేడుకలు రద్దు

ఐపీఎల్ ఆరంభ వేడుకలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది బీసీసీఐ. ఇందుకు వినియోగించే ధనాన్ని పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందివ్వనున్నట్లు తెలిపింది. ఇందుకు బీసీసీఐ పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ చెప్పారు.  ప్రతీ సంవత్సరం ప్రపంచంలోని ఉత్తమ గాయనీ గాయకులతో.. భారతీయ నటులతో ఆహ్లాదంగా వేడుకను మొదలు పెట్టేవారు. ఈ సంవత్సరం మాత్రం అందుకు వెచ్చించే ధనాన్ని అవరుల కుటుంబాలకు ఇవ్వనున్నారు. 2019 ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో చెన్నై తో బెంగళూరు తలపడనుంది. మార్చ్ 23న టోర్ని మొదలు కానుంది.

Latest Updates