2020 జూన్ 21 కల్లా కోటి ఎకరాలకు నీళ్లు : కేసీఆర్

హైదరాబాద్: 2020 జూన్ 21 కల్లా కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతామన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ (అక్టోబర్-16)న తెలంగాణ భవన్‌ లో జరిగిన TRS మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ప్రజలు కోరిన అంశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామనన్నారు.  కాళేశ్వరం పూర్తి చేసి పంటలకు నీళ్లొస్తాయన్న కేసీఆర్.దేవాదుల, తుపాకుల..పాలమూరులో లిఫ్ట్ తో 10, 12 లక్షలకు నీళ్లొస్తాయన్నారు.

నల్గొండలో డిండి పూర్తవుతుందని తెలిపారు.సాగర్ వాటా, ఇతర ప్రాజెకట్ల వాటా అలాగే ఉంటుందని..ఏది ఏమైనా..కోటి ఎకరాలకు నీరు 2020 జూన్ 21 కల్లా సాధించి తీరుతామని తెలిపారు.  నాలుగేళ్లుగా ప్రజలు కోరిన అంశాలను గమనంలోకి తీసుకున్నామన్నారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు గేమ్‌ లాంటిదని..టీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం టాస్క్‌ వంటిదని కేసీఆర్ అన్నారు. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలను ప్రజలకు చెబుతామని.. విభజన సమయంలో సమస్యలు చాలా ఉండేవన్నారు. విద్యుత్, తాగునీరు, సాగునీరు వంటి సమస్యలుండేవని తెలిపిన కేసీఆర్… రాష్ట్రం ఏర్పడ్డనాడు అయోమయ పరిస్థితిలో ఉన్నామన్నారు. ఏడాది తర్వాత కల్యాణలక్ష్మీ పథకంపై ఓ అవగాహనకు రాలేదని.. ఇపుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. నాలుగేళ్లలో తెలంగాణకు కేంద్రం అందించింది సున్నా అని వెల్లడించారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates