2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు : మోడీ

3D2022 నాటికి  రైతుల ఆదాయం  రెట్టింపు చేసేందుకు  సర్కార్ కృషి  చేస్తుందన్నారు  ప్రధాని నరేంద్ర మోడీ.  దేశవ్యాప్తంగా  వీడియో కాన్ఫరెన్స్  ద్వారా  రైతులతో  మాట్లాడారు.  రైతుల ఆదాయం  రెట్టింపు  చేసేందుకు  అవసరమైన సాయం  చేస్తున్నామన్నారు. ఒకప్పడు  ఎరవుల కోసం  రైతులు  క్యూ లైన్లలో  నిలబడే వారని…ఇప్పుడు  ఆ పరిస్థితి లేదన్నారు.  వందకు వంద  శాతం  రైతులకు  ఎరువులు  అందుతున్నాయన్నారు.  2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అని తాను అన్నప్పుడు చాలా మంది నవ్వారని, ఇది చాలా కష్టం, అసాధ్యం అన్నారని మోడీ తెలిపారు. అయితే రైతులపై తమకు నమ్మకముందని మోడీ తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఎక్సెన్ టీవ్ అండ్ బ్యాలెన్స్ డ్ పాలసీ ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వాటర్, ఎలక్ట్రిసిటీ, మార్కెట్లు రైతులకు అందిస్తున్నామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2009-14 మధ్య కాలంలో వ్యవసాయ రంగానికి 1.21 లక్షల కోట్లు కేటాయించగా, బీజేపీ హయాంలో 2014-19 కాలంలో 2.12 లక్షల కోట్లు కేటాయించామని మోడీ తెలిపారు. రైతుల సంక్షేమంపై బీజేపీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్దకు ఇదే నిదర్శనమని మోడీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates