2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు: మోడీ

modi12020 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు ప్రధాని నరేంద్రమోడీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో మోడీ ప్రసంగించారు. రైతులకు మద్దతు ధర లభించేలా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పశువుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రోజుకు 22 కిలోమీటర్ల వరకు రోడ్లు వేశామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రోజుకు కేవలం 11 కిలోమీటర్ల రోడ్లే వేసిందన్నారు మోడీ.

దేశ జనాభాలో 20 శాతం మందికి ఇప్పటికీ విద్యుత్‌ లేక అంధకారంలో ఉన్నారన్నారు. అందుకే తాము విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు ప్రధాని మోడీ.

Posted in Uncategorized

Latest Updates