2020 వరకు ఎలక్ట్రిక్ వాహనాల్లోకి బజాజ్

న్యూఢిల్లీ : తక్కువ రేటు..ఎక్కువ మైలేజీ అంటే వాహనదారులకు టక్కున గుర్తొచ్చేది బజాజ్. ఈ సంస్థ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ పై కన్నేసింది. బజాజ్‌ ఆటో 2020 నాటికి ఎలక్ట్రిక్‌ టూ, త్రీవీలర్ వెహికిల్స్ లోకి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు ఆ సంస్థ ఎండీ రాజీవ్‌ బజాజ్‌.

ఎలక్ట్రిక్ విధానం వాహనదారులకు ఆకర్షణీయంగా ఉందన్నారు.  వచ్చే 12 నెలల కాలంలో మార్కెట్‌ వాటాను 15– 20 శాతం స్థాయి నుంచి ..20–25 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడారు. ‘‘రెండేళ్ల కాలంలోనే 10 శాతం మార్కెట్‌ వాటాను సాధించడం మామూలు విషయం కాదు. ఇది 35 ఏళ్లుగా భారత్‌లో ఉన్న యమహా మార్కెట్‌ వాటాతో పోలిస్తే మూడు రెట్లు’’ అని చెప్పారు రాజీవ్‌ బజాజ్‌.

Posted in Uncategorized

Latest Updates