గతేడాది జవాన్లకు కష్టతరంగా గడిచింది

న్యూఢిల్లీ: భారత ఆర్మీకి, దేశానికి గత ఏడాది కాలం కష్టతరంగా గడిచిందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. కరోనా వ్యాప్తితోపాటు నార్తర్న్ బార్డర్స్‌‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో 2020 చాలా సవాళ్లు విసిరిందన్నారు. ‘గత ఏడాది కాలం దేశంతోపాటు రక్షణ బలగాలకు చాలెంజింగ్‌‌గా సాగింది. ఈ సవాళ్లను అధిగమించడంలో వెటరన్ల (సీనియర్, మాజీ అధికారులు) కృషి దాగుంది. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ విక్టరీని 2021లో గోల్డెన్ విక్టరీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ యుద్ధంలో భారత జవాన్లు తీవ్రంగా పోరాడారు. 50 ఏళ్ల ఈ ఉత్సవానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీలు భావిస్తున్నారు. అందుకే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎగ్జిబిషన్, పరేడ్‌లు నిర్వహించనున్నాం’ అని నరవాణే పేర్కొన్నారు.

Latest Updates