2022నాటికి అందరికీ ఇళ్లు: మోడీ

321ఆర్థికంగా  వెనకబడిన  పేదలకు  ప్రభుత్వ ఫలాలు  అందేలా  చూస్తున్నామన్నారు ప్రధానమంత్రి  నరేంద్రమోడీ.  బిలో  పావర్టీ  లైన్  లిస్ట్  ప్రకారం.. ప్రభుత్వ  పథకాలకు లబ్ధిదారులను  ఎంపిక  చేస్తున్నట్లు  చెప్పారు. వివిధ  రాష్ట్రాల్లోని  ప్రధానమంత్రి  ఆవాస్ యోజన  లబ్ధిదారులతో  ఇంటరాక్ట్  అయ్యారు మోడీ.  హౌసింగ్ సెక్టార్ కు   ఎన్డీయే సర్కార్ ఎక్కువ  ప్రయారిటీ  ఇస్తుందన్నారు.  2022నాటికి ఇళ్లు లేని  వాళ్లు ఉండొద్దన్నారు  ప్రధాని. సొంతిళ్లు  ఉండాలని  ప్రతి ఒక్కరు  కోరుకుంటారని  చెప్పారు.

గృహ నిర్మాణ రంగంలో అవినీతిని, దళారీ వ్యవస్థలను రూపుమాపే విధంగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ స్వంత గృహాలను పొందగలుగుతారన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో ఇళ్లను వేగంగా నిర్మించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు ప్రధాని మోడీ.

Posted in Uncategorized

Latest Updates