2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపులేదు : కేంద్ర హోంశాఖ

2026 తర్వాతే అసెంబ్లీ సీట్లు పెంచగలమని తేల్చి చెప్పింది కేంద్ర హోం శాఖ. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలోని 26(1ఎల్) ప్రకారం అసెంబ్లీ స్థానాలు పెంచాల్సి ఉంది. తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లను.. 153స్థానాలకు… ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలను.. 225 స్థానాలకు పెంచాలని విభజన చట్టంలో ఉంది. చట్టంలో చెప్పినట్టుగా అసెంబ్లీ సీట్లు పెంచాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు చేశాయి. దీనిపై కేంద్ర హోంశాఖ స్పందించింది. 2026 తర్వాతనే అసెంబ్లీ స్థానాలు పెంచగలం అని‌ క్లారిటీ ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉంటుందని తేల్చింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ గంగారాం మీడియాకు వివరించారు.

Posted in Uncategorized

Latest Updates