20 వేలు తిరిగి ఇవ్వలేదని హత్య

  • నిందితుడి అరెస్టు

థానె: అప్పు తిరిగి ఇవ్వలేదని హత్య చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని మహారాష్ట్ర థానె జిల్లాలోని బీవండిలో మంగళవారం అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ‘‘జిల్లాకు చెందిన షాబాద్ అన్సారీ(21) అనే వ్యక్తి సుహైల్ ఖాన్ కు 20 వేల రూపాయలిచ్చాడు. తిరిగి చెల్లించకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం ఖాన్ ను చంపేసి అతని డెడ్​బాడీని పొదల్లో పడేశాడు”అని పోలీసులు చెప్పారు. అన్సారీపై మర్డర్ కేసు నమోదు చేశామన్నారు.

Latest Updates