22న రాష్ట్రానికి రానున్న కేంద్ర ఎన్నికల కమిషన్

కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. దీనికి సంబంధించి పర్యటన షెడ్యుల్ ఖరారైంది. ఈ నెల 22తేదీ(అక్టోబర్ -22)న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓం ప్రకాశ్ రావత్ నేతృత్వంలో 11 సభ్యుల టీం రాష్ట్రానికి రానుంది. అదే రోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానుంది. 6 నుండి 7గంటల వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్,పోలీస్, నోడల్ అధికారులతో సమావేశం అవుతారు.

23న(మంగళవారం)  ఉదయం 9.30 నుండి 1.30 వరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు,SP,DIGలు,IG లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంపై చర్చించనున్నారు. తర్వాత మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 7 గంటల వరకు అన్ని జిల్లాల DEOలు,SP లతో సమావేశం కానున్నారు.

24వ తేదీన (బుధవారం) ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నోడల్ అధికారులు,ఇంకమ్ టాక్స్ అధికారులు, ప్రముఖ బ్యాంక్ అధికారులు, రైల్వే, ఎయిర్ పోర్టు,CPF,రాష్ట్ర పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. 11 గంటల నుండి 12 గంటల వరకు CS,DGP, ఫైనాన్స్ సెక్రటరీ, ఆబ్కారీ ముఖ్య కార్యదర్శి, రవాణా అధికారుల తో భేటీ అవుతారు. ఆ తర్వాత 12.30 గంటల నుండి 1.00 వరకు మీడియా సమావేశం నిర్వహించి..అదే రోజు తిరిగి ఢిల్లీ వెళ్లనుంది కేంద్ర ఎన్నికల కమిషన్.

Posted in Uncategorized

Latest Updates