22 న కావేరిపై పళని అఖిలపక్ష సమావేశం

KAVERIకావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుపై తదుపరి చర్యలకు తమిళనాడు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 22న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని పళనిస్వామి సర్కార్ నిర్ణయించింది. తమిళనాడు సెక్రటేరియట్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.

సుప్రీంకోర్టు తీర్పుతో కర్ణాటకకు ఎక్కువ ప్రయోజనం చేకూరిందని, తమిళనాడుకు తక్కువ జలాల కేటాయింపు జరిగిందని విపక్షాలు ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.  రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించలేకపోయిందని ఆరోపించాయి. ఈ తీర్పుతో తదుపరి చర్యలు తీసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డీఎంకే డిమాండ్ చేసింది. తీర్పును ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న అన్నాడీఎంకే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన అనంతరం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

 

 

Posted in Uncategorized

Latest Updates