నాకు కరోనా సోకింది: ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నానంటే

నాకు కరోనా సోకింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నాను. వైరస్ నుంచి బయటపడేందుకు డాక్టర్ల సలహాలతో బాడీని కూల్ గా ఉంచుకుంటున్నాను. కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దు. జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ నుంచి సురక్షితంగా భయటపడవచ్చు అంటూ ఓ నెటిజన్ తన ఎక్స్ పీరియన్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమెరికా కు చెందిన బ్జోండా హలితి అనే యువతికి కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ టెస్ట్ లు చేయించుకోక ముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్  సోకిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చెప్పింది.

మొదటి రోజుల పొడి దగ్గు మరియు గొంతు మంట, అలసట

రెండవ రోజు  తలలో ఒత్తిడి, రాత్రి చలితో పాటు జ్వరం వచ్చింది.  కళ్ళుమంట తో పాటు గొంతులో మంట

మూడవ రోజు ఎనర్జీ లేక నీరసించి పోవడం, జ్వరం ఎక్కువగా ఉంది. ఆ  సమయంలో పొడి దగ్గు, మైగ్రేన్, జ్వరం, చలి,  వికారంతో డాక్టర్ ను సంప్రదించాను. టెస్ట్ చేసిన డాక్టర్ కొన్ని మెడిసిన్ ఇచ్చినట్లు ట్వీట్ చేసింది.

నాల్గవ రోజుకు జ్వరం తగ్గింది. ఊపిరి ఆడలేదని తెలిపింది. కరోనా లక్షణాలు భయటపడడంతో టెస్ట్ లు చేయించుకున్నట్లు తెలిపింది. టెస్టుల్లో కరోనా సోకినట్లు తేలడంతో డాక్టర్లు సూచనలతో హోం ఐసోలేషన్ వార్డ్ లో రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం కరోనా లక్షణాలు తగ్గుముఖం పట్టాయని నెటిజన్  బ్జోండా హలితి ట్వీట్ చేసింది.

Latest Updates