222కి చేరిన ఇండోనేషియా మృతుల సంఖ్య

ఇండోనేషియాను సునామీ మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శనివారం రాత్రి  సుమత్రా, జావా ద్వీపాల నడుమ సంభవించిన సునామీ ధాటికి ఇప్పటివరకు 222 మంది చనిపోయారు… 600 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు తెలిపారు అధికారులు.

ఎగసిపడిన అలల ధాటికి మరో ఇద్దరు గల్లంతయ్యారన్నారు. భారీ అలల తాకిడికి పండెగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపాంగ్ ప్రాంతాల్లోని 430 భవనాలు, పదుల సంఖ్యలో హోటళ్లు, వాహానాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. బాధితులకోసం పునరావాస చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు. సుండా జలసంధిలో సముద్రగర్భంలోని క్రాకటోప్ అగ్నిపర్వతం బద్దలవడమే సునామీకి కారణమన్నారు అధికారులు. మొదట ఫుల్ మూన్ కారణంగా అలలు ఎగిసిపడుతున్నాయని భావించిన అధికారులు తర్వాత సునామీగా నిర్ధారించారు.సునామికి గల కచ్చితమైన కారణాలు కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇండోనేసియాలోని జావా, సుమత్రా దీవుల మధ్య సునామీ వచ్చింది. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. వీకెండ్ కావడంతో స్థానిక ప్రజలు, పర్యటకులు బీచ్‌ లో ఉత్సాహంగా గడుపుతుండగా.. అకస్మాత్తుగా సునామీ సంభవించింది. క్షణాల్లో ఆ ప్రాంతమంతా అంధకారంలో మునిగిపోయింది.

Posted in Uncategorized

Latest Updates