మేం ఇండియాకు వస్తాం..తీసుకెళ్లండి ప్లీజ్…

హైదరాబాద్​, వెలుగుకరోనా ఎఫెక్ట్​తో విదేశాల్లో ఇండియన్స్​ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము స్వదేశానికి వస్తామని, సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇలా స్పెయిన్​లోని బార్సిలోని ప్రాంతంలో 23 మంది వరకు ఇండియన్స్  చిక్కుకుపోయారు. ఇందులో ఏడుగురు తెలంగాణవాళ్లు కూడా ఉన్నారు. వీళ్లంతా అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. కరోనా వైరస్​తో తీవ్రంగా దెబ్బతింటున్న దేశాల్లో స్పెయిన్​ ఒకటి. తాము భయం భయంగా ఇక్కడ ఓ హోటల్​లో గడుపుతున్నామని, కనీసం తినడానికి ఏమీ దొరకడం లేదని అక్కడి 23 మంది ఇండియన్స్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాకు వద్దామంటే విమానాలు రద్దయ్యాయని, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. వీళ్లంతా తమ బాధలను చెబుతూ ఓ వీడియోను తీసి సోషల్​ మీడియాలో పోస్టు చేశారు. ‘‘ఇండియన్​ గవర్నమెంట్​మాపై దయచూపాలి. ప్లీజ్​.. రిక్వెస్ట్​ చేస్తున్నం. మాకు సాయం చేయండి.. మమ్మల్ని రక్షించండి. ఇండియాకు చేరుకునేలా ఏర్పాట్లు చేయండి’’  అని వేడుకున్నారు.

Latest Updates