24 గంటల కరెంటుతో.. గోడౌన్స్ లో ధాన్యం నిల్వలు పెరిగాయి : హరీష్

harishతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 24 గంటల కరెంట్ ఇచ్చి సాగునీరు అందించడంతో గోడౌన్ లలో నిల్వలు పెరిగాయన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పనితీరుపై శనివారం (జూన్-30)  మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామెల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాటికి అనుగుణంగా వేర్ హౌజింగ్ సంస్థ… గోడౌన్ లు నిర్మించి రైతాంగానికి మేలు చేసిందన్నారు. సంస్థలో సిబ్బంది తక్కువగా ఉన్నారన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు హరీష్ రావు.

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిలువలు 2 మిలియన్ మెట్రిక్ టన్స్ సామర్థ్యానికి చేరి, 100 శాతం వినియోగంతో 2017-18 సంవత్సరంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ముందుగా 100 శాతం ఆక్యుపెన్సీ సాధించినందుకు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం సాధించింది అంటే అది కేవలం సీఎం కేసీఆర్ కృషి వల్లేనని చెప్పారు హరీష్.

నాలుగు ఏండ్ల కాలంలోనే మన గిడ్డంగుల సామర్థ్యం రెట్టింపుకు చేరిందని తెలిపిన ఆయన.. గతంలో 86 శాతం ఉపయోగించే వాళ్లమని, అయితే .. ఇప్పుడు 100 శాతం నిల్వ సామర్థ్యం పెంచుకున్నామన్నారు. దళారుల కోసం కాకుండా రైతుల కోసం పని చేస్తున్న ప్రభుత్వం మనది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గోడౌన్‌ లు నిండిన తర్వాతనే ప్రైవేట్ గిడ్డంగులలో నిల్వ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా నిర్మించిన గిడ్డంగులలో అదనపు ఆదాయం సమకూర్చుకున్నామని చెప్పుకొచ్చారు మంత్రి హరీష్.

Posted in Uncategorized

Latest Updates