24 గంటల కరెంటుతో రైతులకు చేతినిండా పని : పల్లా

pallatrslpకాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారన్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి. శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన శుక్రవారం(ఫిబ్రవరి-9) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు రాష్ర్టాభివృద్ధికి నిరంతరం అడ్డుపడుతున్నారని సీరియస్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వెన్నెముక లేని నేతలన్న ఆయన.. వీధి రౌడీల్లా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు.. తెలంగాణ అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదన్నారు.

ఆరు దశాబ్దాల పాలనలో తాగడానికి నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అని ఎమ్మెల్సీ విమర్శించారు. మిషన్ భగీరథ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏడుస్తున్నారని చెప్పారు. ప్రజలకు అవసరమైనంత మేర నీళ్లు ఇచ్చి తీరుతామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. నిరంతరం కరెంట్‌తో  రైతులకు, కార్మికులకు నిత్యం ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మాణమవుతున్న ప్రాజెక్టు కాళేశ్వరం అని ఎమ్మెల్సీ తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates