పాపం పాప:  అమ్మ శవం పక్కనే 24 గంటలు

అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. అదే గదిలో 24గంటల పాటు పది నెలల పాప ఆకలితో తల్లడిల్లిపోయిం ది. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలోచోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… మంచిర్యాల పట్టణంలోని మిమ్స్‌‌ డిగ్రీ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్నఆకారపు కుమార్‌‌ అమ్మమ్మ అనారోగ్యం తో కరీంనగర్‌‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్​లో చికిత్సపొం తోంది. అమ్మమ్మను చూసేందుకు కుమార్‌‌  ఈ నెల 2న కరీంనగర్‌‌ వెళ్లాడు. తిరిగి శుక్రవారం వచ్చేసరికి ఇంటి గడియ పెట్టి ఉంది.పిలిచినా ఎవరూ పలకలేదు. ఎంత పిలిచిన డోర్‌‌ తీయకపోయే సరికి కిటికిలోంచి చూడగా బెడ్‌ రూంలో ఫ్యానుకు భార్య లక్ష్మిప్రియ (29) ఉరివేసుకుని కనిపించింది. అదే గదిలో కూతురు నిఖిత (10 నెలలు) ఉంది. పట్టణ ఇన్‌ చార్జి సీఐ చంద్రమౌళి, ఎస్సై ఓంకార్‌‌యాదవ్‌ వివరాలు సేకరిం చారు. నీరసించి పోయి ఉన్న కూతురును స్థానిక హాస్పి టల్​కు తరలించారు.

 

Latest Updates