24 గంటలూ నెఫ్ట్‌‌, ఐఎంపీఎస్‌‌ సేవలు

న్యూఢిల్లీ: నెఫ్ట్‌‌, ఐఎంపీఎస్‌‌, యూపీఎస్‌‌, బీబీపీఎస్‌‌ వంటి సేవలను రోజుకు 24 గంటలూ అందించాలని ఆర్‌‌బీఐ బ్యాంకులను సోమవారం ఆదేశించింది. దీనివల్ల డబ్బు బదిలీ, వస్తువుల కొనుగోలు, సర్వీసులు, బిల్‌‌పేమెంట్లు ఎప్పుడంటే అప్పుడు కట్టుకోవచ్చని పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా ప్రజలు బయటకు వెళ్లడం లేదని, ఈ సేవలను నిరంతరం అందించడం వల్ల ఇబ్బందులు ఉండవని తెలిపింది. ఇదిలా ఉంటే,  కరోనా ప్రభావం తమ బ్యాలెన్స్‌‌ షీట్లపై ఎంత వరకు ఉంటుందో అంచనావేయాలని ఆర్‌‌‌‌బీఐ సోమవారం బ్యాంకులు, ఫైనాన్షియల్‌‌ ఇనిస్టిట్యూషనల్స్‌‌ను కోరింది.

Latest Updates