అవమానాలను తట్టుకొని.. స్టీరింగ్ పట్టుకొంది

24-year-old-mechanical-engineer-becomes-mumbais-first-woman-bus-driver

ఈ తరం కొందరు అమ్మాయిలు రంగుల ప్రపంచంలో విహరించాలని.. మోడలింగ్ రంగంలో మెరవాలని కలలు కంటూ ఉంటారు. అందుకు భిన్నంగా ఓ అమ్మాయి మాత్రం స్టీరింగ్ పట్టి ముంబై వీధుల్లో బస్ డ్రైవింగ్ చేస్తోంది. ముంబయిలో ఏకైక మహిళా బస్సు డ్రైవర్‌గా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

ముంబయికి చెందిన 24 ఏళ్ల ప్రతీక్ష దాస్.. మలాద్‌లోని ఠాకూర్ కాలేజ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆర్టీవో అధికారి కావాలని భావించిన ఆమె.. అందుకు హెవీ వెహికిల్ లైసెన్స్ తప్పనిసరి అని తెలుసుకొని బస్సులు, ట్రక్కులు నడపడం నేర్చుకొంది.

బస్సు నడపడం నేర్చుకునే సమయంలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, చాలా మంది తాను పొట్టిగా ఉన్నానని, బస్సు నడపగలదా అని అవహేళనగా మాట్లాడేవారని ప్రతీక్ష పేర్కొంది. కానీ అవేవీ పట్టించుకోకుండా ‘‘ముంబయి వీధుల్లో బస్సు నడపాలనే నా కలను నెరవేర్చుకునేందుకు పట్టుదలతో ప్రయత్నించానని’’ ఆమె తెలిపింది. పట్టుదలతో శ్రమిస్తే ఎవరికైనా సరే ఇది సాధ్యమే అని ప్రతిక్ష అంటోంది. త్వరలో తాను జమ్ము కశ్మీర్‌లోని లడక్‌కు బైకులో వెళ్లాలనున్నట్టు ఆమె తెలిపింది.

Latest Updates