25 గేట్ల పనులు పూర్తి : మిడ్ మానేరు సక్సెస్

midmanerudamcreatsమిడ్‌ మానేరు ప్రాజెక్టు గేట్ల బిగింపు సహా అన్ని సివిల్, మెకానికల్, సాంకేతిక పనులు పూర్తయ్యాయి. 2006లో ప్రారంభమైన ప్రాజెక్టు పదేళ్లలో 50 శాతం పూర్తయితే.. మిగతా 50శాతం పనులు 10 నెలల్లోనే పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం రికార్డు తిరగరాసింది. శ్రీరాంసాగర్‌కు అత్యంత కీలకమైన ప్రాజెక్టు మిడ్‌మానేరు. మిడ్‌మానేరు ప్రాజెక్టుకు 25గేట్ల బిగింపు పూర్తయింది.దీంతో 25 టీఎంసీల నీటి నిల్వకు ప్రాజెక్టు సిద్ధమైంది. డ్యాంపై స్పిల్‌వే బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయింది. మొత్తం రూ.2,150 కోట్ల ఖర్చుతో 10 నెలల్లోనే 50 శాతం పనులు పూర్తిచేశారు. మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు మిడ్‌మానేరు ద్వారా సాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టు 25గేట్ల ఫ్యాబ్రికేషన్, బిగింపు పనులు పూర్తవడం పట్ల మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తికావడం పట్ల ఇంజనీర్లను మంత్రి అభినందించారు.

Posted in Uncategorized

Latest Updates