25 నుంచి దుర్గమ్మ శాకంబరి ఉత్సవాలు

DURGAవిజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జూలై 25 నుంచి 27 వరకు శాకంబరి ఉత్సవాలు నిర్వహించనున్నారు. పండ్లు, కూరగాయలతో ఈ మూడు రోజులూ అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు విరాళాలు కూడా ఇవ్వొచ్చని దేవస్థానం అధికారులు తెలిపారు. మరోవైపు చంద్రగ్రహణం కారణంగా జూలై 27న దుర్గగుడిని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు గుడిని మూసివేయనున్నారు. మరుసటి రోజు (జూలై- 28న) ఉదయం 10 గంటల నుంచి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామని దేవస్థానం అధికారులు వెల్లడించారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates