ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 25కరోనా పాజిటివ్ కేసులు

వరంగల్ లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్నారు ఎంజీఎం నోడల్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 25కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు.

వరంగల్ అర్బన్ లో-21, ములుగు-2, భూపాలపల్లి-1, జనగామ-1 గా కరోనా కేసులు నమోదయ్యాయని ప్రకటించారు. అయితే 25 పాజిటివ్ కేసుల్లో ఒక్కరూ మినహా అందరూ ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారేనని…ఒక వ్యక్తికి మాత్రం వైరస్ ఎలా సోకిందో తెలియదన్నారు. అతనికి వైద్యం చేసిన పీజీ విద్యార్థుల శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ పంపించామని చెప్పారు. వరంగల్ ఎంజీఎంలో ఐదుగురు అనుమానితులకు వైద్యం అందిస్తున్నామని… అనుమానితులకు చెందిన 120 బంధువులను ఐసోలేషన్ లో ఉంచామని తెలిపారు డాక్టర్ చంద్రశేఖర్.

Latest Updates