శ్రీలంకలో బాంబు పేలుళ్లు..129 మంది మృతి

ఈస్టర్ పర్వదినాన శ్రీలంక రాజధాని కొలంబో బాంబుల మోతతో దద్దరిల్లింది. మూడు చర్చిలు, మూడు  హోటళ్లు లక్ష్యంగా  బాంబు పేలుళ్లు జరిగాయి ఈ పేలుళ్లలో 129 మృతి చెందగా 300 మందికి పైగా గాయాలయ్యాయి. అలాగే శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటల్‌లోనూ బాంబులు పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో చర్చిలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుళ్లు జరిగిన చోట్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈస్టర్ సండే రోజున ప్రార్థనలు జరుగుతుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో వరుస పేలుళ్లు జరిగినట్లు పోలీసు ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు.  ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. శ్రీలంకలోని భారత అధికారులతో మాట్లాడామని అన్నారు.ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నామని చెప్పారు.

 

Latest Updates