25 మంది హెల్త్ సిబ్బందికి కరోనా

పుణె : కరోనా నివారణకు కృషి చేస్తున్న హెల్త్ సిబ్బంది దీని బారినపడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వందలాది మందికి కరోనా ఎఫెక్ట్ చూపగా తాజాగా పుణెలోని ఓ క్లినిక్ లో పనిచేస్తున్న 25 మంది హెల్త్ సిబ్బందికి కరోనా సోకింది. రూబీ హాల్ అనే క్లినిక్ లో పనిచేసే హెల్త్ సిబ్బందికి కరోనా లక్షణాలుండటంతో దాదాపు వెయ్యి మందికి టెస్ట్ లు చేశారు. మొత్తం 25 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరిలో 19 మంది నర్సులు కూడా ఉన్నారు. వీరందరికీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని క్లినిక్ సీఈఓ బోబి బోటే తెలిపారు. వారితో కలిసి పనిచేసిన సిబ్బంది అందరినీ క్వారంటైన్ కు తరలించారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Latest Updates