హైదరాబాద్ లో 25 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాలు సీజ్

హైదరాబాద్ లో రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనదారులపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు. ఒకేసారి గుంపులు గుంపులుగా వాహనాలను నడుపుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ తో పాటు లైటింగ్, సౌండ్స్ తో హంగామా సృష్టిస్తున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 25  మంది రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనదారులపై  కేసు నమోదు చేసి… 25 వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 550కి పైగా వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. అయితే సీజ్ చేసిన వాహనాలను విడిపించేందుకు ప్రముఖులు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు.

3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఖర్చులు కేంద్రానివే

Latest Updates