చేపల పెంపకంతో నెలకు రూ.25 వేలు

తక్కువ ఖర్చు, తక్కువ నీటితో మంచి లాభమొచ్చే కొత్తరకం చేపల పెంపకం పద్ధతిని నేషనల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌డీపీఆర్‌‌‌‌‌‌‌‌) డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసింది. చేపల చెరువుకు కొంచెం ప్లేస్‌‌‌‌‌‌‌‌ ఉంటే చాలు.. నెలకు రూ.25 వేలు ఈజీగా వస్తాయని చెబుతోంది. చేపలను పెంచాక మిగిలిన వేస్ట్‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ను కూడా వేస్ట్‌‌‌‌‌‌‌‌గా పోనీయకుండా వ్యవసాయానికి వాడుకోవచ్చంటోంది.

90 వేల లీటర్ల కెపాసిటీ చెరువుతో..

తక్కువ నీరు తీసుకునే ఈ కొత్త చేపల పెంపకం పద్ధతికి బ్యాక్‌‌‌‌‌‌‌‌యార్డ్‌‌‌‌‌‌‌‌ రీ సర్క్యలేటరీ ఆక్వాకల్చర్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ (బీఆర్‌‌‌‌‌‌‌‌ఏఎస్‌‌‌‌‌‌‌‌)గా ఎన్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌డీపీఆర్‌‌‌‌‌‌‌‌ పేరు పెట్టింది. కొచ్చిన్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ (సీయూఎస్‌‌‌‌‌‌‌‌ఏటీ)లో దీన్ని స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ పద్ధతిలో 90 వేల లీటర్ల కెపాసిటీ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ను కడతారు. దీన్ని మళ్లీ 30 వేల లీటర్ల 3 భాగాలుగా విభజిస్తారు. చూడటానికి అచ్చం అక్వేరియంలానే ఉంటుంది. ట్యాంకుల్లోకి ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ పంపిస్తుంటారు. ఇలా చేస్తే తక్కువ స్పేస్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ చేపలు పెరుగుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ నమూనాను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లోని రూరల్ టెక్నాలజీ పార్కులో ఏర్పాటు చేశారు. నేషనల్‌‌‌‌‌‌‌‌ ఫిషరీస్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డు (ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌డీబీ) సాయం అందించింది. రైతులకు, సెల్ఫ్‌‌‌‌‌‌‌‌ హెల్ప్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌లకు, యూత్‌‌‌‌‌‌‌‌కు ఎలా ఫార్మింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలో ఇక్కడ వివరిస్తారు.

ఒక్కో చెరువుకు రూ.7 లక్షల ఖర్చు

ఒక చేపల చెరువును కట్టడానికి సుమారు రూ.5.6 లక్షలు ఖర్చవుతుంది. కరెంటు, చేపల ఆహారం, నిర్వహణకు మరో 1.4 లక్షలు అవుతుంది. ఫామ్‌‌‌‌‌‌‌‌ కోసం మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌డీబీ 60 శాతం సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన వారికి 40 శాతం అందిస్తోంది. ఈ పద్ధతిలో రైతులు నెలకు రూ.25 వేల వరకు పొందగలరని ఎన్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌డీపీఆర్‌‌‌‌‌‌‌‌ చెబుతోంది.

చెరువులో బయో ఫిల్టర్లు

బీఆర్‌‌‌‌‌‌‌‌ఏఎస్‌‌‌‌‌‌‌‌ ఓ ఆక్వాకల్చర్‌‌‌‌‌‌‌‌ ఫామ్​లో నీటిని వడబోసేందుకు బయో ఫిల్టర్లను వాడుతారు. ఫిష్‌‌‌‌‌‌‌‌ వేస్ట్‌‌‌‌‌‌‌‌ వల్ల ఉత్పత్తి అయ్యే అమ్మోనియా (ఎక్కువైతే నీరు విషపూరితమవుతుంది)ను ఈ బయోఫిల్టర్‌‌‌‌‌‌‌‌ తగ్గిస్తుంది. నీటిలో అమ్మోనియా స్థాయి ఓ లెవల్‌‌‌‌‌‌‌‌కు వచ్చాక ఆ నీటిని పూర్తిగా తీసేయాల్సిందే. ఇలా తీసేసే నీటిని వ్యవసాయానికి కూడా వాడుకోవచ్చు. తిలపియా, పంగాసియస్, ముర్రెల్, పెర్ల్‌‌‌‌‌‌‌‌స్పాట్‌‌‌‌‌‌‌‌ చేపలను ఈ పద్ధతిలో బాగా పెంచవచ్చు. తక్కువ నీళ్లున్న ప్రాంతాల్లో ఉండే రైతులు కూడా ఈ పద్ధతితో మంచి లాభాలు పొందొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

టార్గెట్‌‌‌‌‌‌‌‌ యూత్‌‌‌‌‌‌‌‌

బీఆర్‌‌‌‌‌‌‌‌ఏఎస్‌‌‌‌‌‌‌‌ పద్ధతిని ప్రమోట్‌‌‌‌‌‌‌‌ చేయడానికి ఎన్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌డీపీఆర్‌‌‌‌‌‌‌‌ రకరకాలుగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా యూత్‌‌‌‌‌‌‌‌ను, ఫిషరీ గ్రాడ్యుయేట్స్‌‌‌‌‌‌‌‌ను అక్వాకల్చర్​వైపు తీసుకొచ్చేందుకు ట్రై చేస్తోంది. కేరళలో ఇప్పటికే ఇలాంటి నమూనా చెరువులను చాలానే స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. కరువు ప్రాంతాల్లోనూ ఈ పద్ధతి బాగా పని చేస్తుందని చెబుతోంది.

Latest Updates