26 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర

uttam–= బస్సు యాత్రకు ప్రజా చైతన్య యాత్రగా నామకరణం

ఎట్టకేలకు ఖరారైంది …కాంగ్రెస్‌ బస్సు యాత్ర షెడ్యూల్‌. ఈ బస్సు యాత్రకు ప్రజా చైతన్య యాత్రగా పేరు పెట్టారు. ఈ నెల 26 నుంచి మార్చి 12 వరకు తొలి దశ యాత్ర కొనసాగనుంది. 12 రోజుల పాటు నిర్వహించే యాత్రలో 24 నియోజక వర్గాల్లో పర్యటిస్తారు. తొలిదశలో పాత రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో యాత్ర జరగనుంది. హోలీ, పెళ్లిళ్ల దృష్ట్యా మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు యాత్రకు విరామం ప్రకటించారు. ఫిబ్రవరి 26వ తేదీన చేవెళ్ల, వికారాబాద్‌, 27న తాండూరు, సంగారెడ్డి, 28న జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, మార్చి 4న బోధన్‌, నిజామాబాద్‌, 5న ఆర్మూర్‌, బాల్కొండ, 6న నిర్మల్‌, బోధ్‌, 7న ఖానాపూర్‌, మెట్‌పల్లి, 8న జగిత్యాల, సిరిసిల్లా, 9న కరీంగనర్‌, మానకొండూరు, 10న హుస్నాబాద్‌, హుజురాబాద్‌, 11న పెద్దపల్లి, రామగుండం, 12న మంథని, భూపాలపల్లిలో ఈ యాత్ర కొనసాగుతుంది. దీనితో మొదటి దశ బస్సు యాత్ర ముగుస్తుందని గాంధీభవన్‌ వర్గాలు సోమవారం తెలిపాయి. కాగా, షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని నాయకులు చెప్పారు.

ఢిల్లీకి వెళ్లిన ఉత్తమ్

ఇదిలా ఉండగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిన్న(సోమవారం) సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్‌ చేపట్టనున్న ప్రజా చైతన్య యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌తో ఆయన అధిష్ఠానం వద్దకు వెళ్లినట్లు సమాచారం. తొలి దఫా షెడ్యూల్‌ను రూపొందించినప్పటికీ, అందులో చిన్న చిన్న మార్పులు చేసినట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌తోపాటు రాహుల్‌ రాష్ట్ర పర్యటనను ఖరారు చేసుకొని ఆయన తిరిగొస్తారని చెపుతున్నారు గాంధీభవన్‌ వర్గాలు.

Posted in Uncategorized

Latest Updates