26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి: డేవిడ్ హెడ్లీపై దాడి

అమెరికాలోని చికాగో జైలులో శిక్ష అనుభవిస్తున్న ముంబై దాడుల (26/11) వ్యూహకర్త డేవిడ్ హెడ్లేపై ఇద్దరు ఖైదీలు దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హెడ్లే పరిస్థితి విషమంగా ఉంది. దీంతో తీవ్రంగా గాయపడిన హెడ్లీని ఆస్పత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. జూలై 8న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాకిస్తాన్ సంతతికి చెందిన డేవిడ్ హెడ్లే అమెరికావాసి. అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారిగా ఎప్పుడూ పాక్ వచ్చేవాడు. అదే సమయంలో హెడ్లీకి లష్కరే తోయిబాతో పరిచయం ఏర్పడింది. తర్వాత లష్కరే దగ్గర టెర్రరిస్టు ట్రైనింగ్ తీసుకున్న హెడ్లీ.. ముంబైలో దాడి చేసేందుకు రహస్య ఏజెంటుగా పనిచేశాడు. రెక్కీలు నిర్వహించడంలోనూ సాయం చేశాడు. 168 మంది ప్రాణాలు తీసుకున్న ముంబై ఘటనకు సూత్రధారిగా నిలిచాడు. 2009 అక్టోబర్‌లో షికాగోలోని ఓహేర్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టునుంచి పాకిస్తాన్‌కు వెళ్తుండగా హెడ్లీని పోలీసులు అరెస్టు చేశారు. 2013లో అమెరికా కోర్టు ముంబై దాడుల కేసులోనే ఈయనకు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటినుంచి ఈ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు.

 

Posted in Uncategorized

Latest Updates