27న శ్రీవారి ఆలయం మూసిివేత : చంద్ర గ్రహణం కౌంట్ డౌన్ ప్రారంభం

ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన, అద్భుతమైన చంద్రగ్రహణం జూలై 27వ తేదీన ఏర్పడనుంది. అందుకు సంబంధించి కౌంట్ డౌన్ కూడా ప్రారంభం అయ్యింది. గంటా 45 నిమిషాలు గ్రహణం ఉంటుంది. చంద్ర గ్రహణం కారణంగా భూగ్రహ ఛాయలు అదృశ్యం కాకుండా.. పరావర్తనం చెందిన సూర్య కిరణాల వల్ల పూర్తిగా ఎరుపు రంగు వర్ణంలోనే చంద్రుడు కనిపించనున్నాడు. దీంతో దీనిని బ్లడ్ మూన్ గా పిలుస్తారు. ఆ సమయంలో భూమి చుట్టూ నీడలు ఏర్పడతాయి. అంతేకాదు భూమికి దగ్గరగా వస్తున్నందున.. అంగారకుడు అదే రోజున సాధారణం కంటే మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. భూమి, చంద్రుడికి చాలా దూరంగా ఉన్న అంగారక గ్రహాన్ని కూడా ఆ రోజు చూసే అవకాశం లభించనుంది. ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భూమికి దగ్గరగా వస్తాడు అంగారకుడు. ఈసారి మాత్రం  స్పష్టంగా కనిపించనున్నాడు. మొత్తానికి ఆకాశంలో ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు అంద‌రు ఉత్కంఠ‌గా వెయిట్ చేస్తుండగా.. అందుకు కౌంట్ డౌన్ కూడా మొదలైపోయింది.

చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు TTD ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి 28వ తేదీ తెల్లవారుజాము 4.15 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నారు. 27వ తేదీ రాత్రి 11.45 గంటల నుంచి 28న తెల్లవారు జామున 3.49 గంటల వరకు చంద్రగ్రహణం ఘడియలు ఉంటాయని…గ్రహణం పట్టే సమయానికి 6 గంటల ముందుగానే ఆలయ ద్వారాలు మూసివేయటం ఆనవాయితీ. గ్రహణం తర్వాత ఆలయ తలుపులు తెరిచి సుప్రభాత సేవ తర్వాత శుద్ధి, పుణ్యవచనం నిర్వహిస్తారు ఆలయ పూజారులు. తర్వాత తోమాల, కోలువు, పంచాంగశ్రవణం, అర్చణ వేవలను ఏకాంతంగంగా పూర్తి చేస్తారు. 28న స్వామివారికి ఉదయం సేవలు పూర్తయ్యాక ఉదయం 7 గంటల తర్వాతే సర్వదర్శనం ఉంటుంది. అంతకు ముందు రోజు 27న శ్రీవారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, గరుడవాహన సేవలను టీటీడీ రద్దు చేసింది.

భక్తులు ఈ విషయాలను గుర్తించుకోవాలని కోరారు. ఆలయం మూసివేస్తున్నందుకు భక్తులు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు.

Posted in Uncategorized

Latest Updates